తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం సర్వేలు గురుకుల పాఠశాలలో చదవడమేనని తెలంగాణ DGP మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో గురుకుల పాఠశాలను ప్రారంభించి నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ.. నాటి విద్యా శాఖ మంత్రి పీవీ నరసింహారావు, గ్రామానికి చెందిన స్థల ధాత రావి నారాయణరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మహేందర్ రెడ్డి సూచించారు.