మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పి. వి. నరసింహారావు గారు విద్యాశాఖామంత్రిగా ( అప్పటి ఏ పిలో) 1968 -71 లో వున్నప్పుడు దేశం లోని అన్ని పేరొందిన, గొప్ప విద్యాలయాలను దర్శించి ఒక అవగాహన కి వొచ్చారు.వారు 1971 లో ముఖ్యమంత్రి కాగానే తాను అనుకున్న విధము గా తెలంగాణ జిల్లాల గ్రామీణ నేపధ్యం లో వున్న ప్రతిభావంతులైన విద్యార్థులకి మంచి విద్యనందించాలనే ఉద్దేశ్యముతో ” గురుకుల పాఠశాల ” ప్రారంభించాలని అనుకున్నారు .స్వర్గీయ శ్రీ మద్ది నారాయణ రెడ్డి గారు తన వూరు సర్వైల్ ,నల్లగొండ జిల్లా , లో గల 44 ఎకరాలు దానమివ్వడం, పి వి గారు అందులో ” గురుకుల విద్యాలయము ” మొదలు పెట్టడం జరిగింది .4th క్లాస్ లో టాపర్లకి ( విల్లెజి గవర్నమెంటు స్కూళ్లలో చదివిన విద్యార్థులకు మాత్రమే )ఎంట్రన్స్ టెస్టు పెట్టి అందులో టాప్ 30 మందికి సర్వైల్ స్కూల్ లో దాదాపుగా “ఉచిత విద్య ” ను అందించడం మొదలు పెట్టారు .అలాగే 7th క్లాస్ లో 70 % పైన ( 10 జిల్లాల గ్రామాల్లో ) వొచ్చిన వారికి టెస్ట్ పెట్టి అందులో టాప్ 105 విద్యార్థులను సెలెక్ట్ చేసి 10th క్లాస్ వరకు సర్వైల్ లో నిజమైన గురుకుల విద్యాభోదన మొదలు పెట్టారు.1972 లో ఆంధ్ర జిల్లాలకు “తాడికొండలో”, రాయలసీమ జిల్లాలకు “కొడిగనహళ్లిలో ” ఇదే తరహాలలో “గురుకుల విద్యాలయాలు ” స్థాపించారు .శ్రీ పి వి గారు దేశప్రధాని కాగానే ఇదే కాన్సెప్ట్ తో “నవోదయ విద్యాలయాలు ” దేశమంతా స్థాపించారు.ఈ “విద్యాలయాలన్నీ” ఎందరో ప్రముఖులను తయారుచేసిందనడములో ఎటువంటి సందేహం లేదు.
చాలామందికి తెలీని విషయమేమిటంటే ఇప్పుడున్న “నారాయణ /చైతన్య ” లు అదే విద్యావిధానాన్ని మక్కికి మక్కి కాపీ కొట్టి నడిపిస్తున్నారు ( కేవలము చదువు మాత్రమే , ఆటపాటలు , ,,,, లాంటివి కాకుండా ).
నాకు సర్వైల్ స్కూల్ లో 8th క్లాసులో అడ్మిషన్ రావడం నా జీవితం లో అతి పెద్ద అదృష్టము .స్కూలు లో చదువు అన్నది ‘పది’ విషయాల్లో ఒకటి , అబ్బో చెప్పాలంటే చాలా వున్నాయి .Ex : సాయంత్రం 4 టు 6 :30 వరకు ఆటలు ఆడినా లేకున్నా గ్రౌండులో ఉండాలి , పుస్తకాలు పట్టుకొని చదువుతా అంటే దెబ్బలు పడేవి( ఆబ్బె , నాకు కాదండి , నేనా టైపు కాదండి).20yrs కింద “అలుమ్ని అసోసియేషన్ ” ఉందని తెలిసింది , ఇహ అప్పటినుండి ఇప్పటివరకు స్కూలుకి సంభందించిన చిన్న పెద్ద ఈవెంట్లలో నా పాత్ర ఉంది,ప్రతీ సంవత్సరం ‘మెడికల్ కాంపు, కెరీర్ గైడెన్స్ ,హరిత హారం ‘ లాంటివి స్కూల్లో తప్పనిసరిగా జరుగుతాయి. ఇవికాకుండా ‘ఫామిలీ గెట్ టు గెదర్ , AGM లు కూడా (అలుమ్ని ఆధ్వర్యములో ). ఆబ్బె , నాకు ఏ “పోస్టు” ఉండేది కాదండి, నేను ‘తాజ్మహల్ కి రాళ్ళెత్తిన కూలి’ టైపు అన్నమాట, ఎప్పుడూ తెరవెనకే.నా బడి, నా బాధ్యత అన్నటైపు .చాలా నేర్పించిందండి నా బడి , గుడి .ఎంత చెప్పినా తక్కువే ,మరోపోస్టులో ఎప్పుడైనా చెప్తాలెండి .
26th Dec నాడు “గోల్డెన్జుబిలీ సెలెబ్రేషన్స్ ” ఘనం గా చేయాలి అని డిసైడ్ అయ్యింది .నా లాగే చాలామంది చాలా ఏళ్ళనుండి స్కూలుకి తమకు తోచిన విధం గా పని/సహాయం చేస్తున్నారు.”రూబీ జూబిలీ “Feb 2012 లో స్కూలులో ఘనం గా చేసాము . ఈ సారి ఇంకా బాగా చేయాలి అని ఓ పద్ధతి ప్రకారం కమిటీలు వేసి తలా ఓ పని అప్పచెప్పారు .అనొద్దు కానీ మా”వాళ్ళు ” స్కూలు పని అంటే ఇంటిపని, స్వంతపని ని కూడా వదిలేసివొస్తారు (వాళ్ళింట్లో వాళ్లు కూడా ఈవిషయములో చెబితే వినే రకం కాదని వొదిలేస్తారనుకోండి, అది వేరేవిషయం ) .26th dec నాడు ఫంక్షన్ హాల్లో స్వర్గీయ శ్రీ పి వి నరసింహారావు గారి ఫ్యామిలీని & మద్ది నారాయణ రెడ్డి గారి ఫ్యామిలీని సత్కరించడం జరిగింది.మాకు పాఠాలు చెప్పిన గురువులందరికి సత్కారాలు జరిగిగాయి. ఇంకా చాలా జరిగాయి, నేనక్కడలేను , వంటలదగ్గరే వున్నా. నేను భోజన ప్రియున్ని , “మా వాళ్ళు ” ఎక్కడ ఈవెంట్ అయినా F & B మొత్తం నాకే అప్పచెపుతారు( ఎందుకు ‘గాలికి పోయే కంపతో’ పెట్టుకోవడం అవసరమా అని ) .మొత్తం ‘మెనూ ‘ నాఇష్టానికే వొదిలేశారు , టీలు , టిఫినీలు, భోజనం గట్రా అన్ని నా ఇష్టప్రకారమే చేశా ,అదేంటో ప్రతీసారి ఎంతబాగా చేసినా నా తప్పులే నాకు కనపడతాయి , నెక్స్ట్ టైము అవి రిపీట్ కాకుండా చూస్తాను అనుకోండి అది వేరేవిషయం , ప్రతీసారి ఓకొత్త విషయం నేర్చుకోవడమే, సర్లెండి ఇది ఫస్టు కాదు , లాస్ట్ కాదు .
మొత్తానికి ఫంక్షన్ “మేము” అనుకున్నదానికంటే గ్రాండ్ గా ,ఘనం గా జరిగింది .దాదాపు సంవత్సరంగా పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి “అందరూ” ఎంజాయ్ చేశారు.కరోనా టైము కదా , అందుకే ఆ రోజు ఎంతమంది వొచ్చారన్నది చెప్పలేను .”ఇంతమందికి” భోజనాలు పెట్టడం నా లైఫులో మొదటిసారి.