అట్టడుగు పల్లె మట్టిని మాణిక్యాలుగా మార్చిన ఒక మానవ వికాస కర్మాగారం. చదువు అంటే బట్టి పట్టి డిగ్రీలు తెచ్చుకొని ,హోదా పొంది కేవలం సంపద పోగు చేసుకోవడం మాత్రమే కాదని, 360 డిగ్రీల కోణంలో మనిషిని తీర్చిదిద్దిన ఒక అపురూప కర్మాగారం. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అర్థాలను ఆచరణ రూపంలో మాలో నింపిన ఒక అద్భుత ఒడి.
దాన్ని ఉత్తి బడి అనలేను.
నా వరకైతే GK murthy sir ద్వారా మొట్టమొదట కారల్ మార్క్స్ పేరు వినడము దాస్ కాపిటల్ ఈ ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప సాధనం అని వినడము, ముఖ్యంగా అది చిట్డచివరి వాని క్షేమాన్ని కాంక్షిస్తుందని విన్నప్పుడు కలిగిన ఆనందము, ఉత్సాహం ఈనాటికీ గుర్తుంది. నీలం సంజీవరెడ్డి( The then President of India) కి మన సంజీవరెడ్డి ( school mess worker) కి తేడా లేదని, అదే ప్రజాస్వామ్యం గొప్ప తనమని చెప్పిన మాటలు చెవుల్లో ఇప్పటికీ గింగర్లు కొడుతూనే వున్నవి.
జీవితంలో ఎదురైన అనేక సవాళ్ళకు ,ప్రశ్నలకు ఒక తార్కిక సమాధానం అందించిన విజ్ఞాన ఘని మా బడి. కొండొకచో upper middle class సహచరులను చూసి కొంత నేర్చుకోవడం, ఆర్థిక అసమానతల సామాజికార్థక రాజకీయ కోణాలు తెలిసో, తెలవకో చేసిన వెక్కిరింతల మీద ధిక్కారం ప్రకటించడం ఒక అనుభవం.
పదవతరగతి పూర్తి అయ్యేవరకు 24 గంటలు కలిసి వున్నప్పటికీ 3 సంవత్సరాల కాలంలో ఎవరి కులం ఏమిటో తెలవకపోవడం ఒక అద్భుతం.
భోజనశాలలో ప్రతి టేబుల్ మీద 9 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయురాలు కూర్చొని భోజనం చేయడం ఒక సమానత్వ భావనను సోదరత్వాన్ని పెంచింది.
ఉపాధ్యాయులు/ ఉపాధ్యాయిరాళ్ళు 24 గంటలు మాతో క్యాంపస్ లో వుండడం ఒక గొప్ప అనుభవం.
ఈనాడు దేశంలో వున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్ లు దాని ప్రేరణ ఫలితమే.
Even the time table and curriculum are copied from it .
కాని అతి ముఖ్యమైన sports, Library ని మాత్రం మా స్కూల్ లో లాగా ఏ విద్యాసంస్థ అందించలేదు.
నా ప్రీతిపాత్రమైన గురువులు అనేకులు మచ్చుకు GK Murthy sir, PD Krishnamurthy sir, Vidya madam, Ranga RAO sir, Shyam Prasad sir, Ramana Murthy sir, Anjireddy sir….అనేకులు .అందరికీ వందనాలు.
మర్రి శ్రీనివాస్ రెడ్డి సర్ ప్రిన్సిపల్ . తను లేకపోతే ఈనాటి మేము లేము అన్నంతగా జీవితాన్ని ,సంస్కారాన్ని, సహోదర తత్వాన్ని బోధించిన గొప్ప టీచర్ and administrator. అదృష్టవశాత్తూ నాకు APRJC Nagarjuna sagar లో కూడా సారే ప్రిన్సిపాల్. నా 5 సంవత్సరాల రెసిడెన్షియల్ విద్యాభ్యాసం లో నాలుగున్నర సంవత్సరాలు నా ప్రిన్సిపాల్ తనే. ఆ రకంగా నేను అదృష్ట వంతున్ని.
Last but not the least -లైబ్రరీ.
ఎంత చెప్పినా తక్కువే. సర్వేల్ స్కూల్ లో 8 వ తరగతిలో చేరినంక, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు , సమాజంలో పీడన ,అణచివేత ,దోపిడీల నేపథ్యం అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న కాలంలో నాకు ఒక దిక్సూచిగా మారి సామాజిక అవగాహన అందించిన గురువు అది.
ప్రేమ్‌చంద్ గబన్ తో మొదలైన నా గమనం సహజంగానే గ్రామీణ రైతు కుటుంబం వెతలకు కార్యకారణ సంబంధాన్ని వెతుక్కుంది.
మహా ప్రస్థానం, ఈ దేశం నాకేమిచ్చింది, సంఘం చెప్పిన శిల్పాలు , నీ బాంచన్ కాల్మొక్త, చరమరాత్రి కథలు, పెంకుటిల్లు చాంతాండంత ఈ లిస్టు నేపథ్యంలో ఇవ్వాళ డాక్టర్ కాసుల లింగారెడ్డి గా మీ ముందు నిలబడ్డాను.
పాఠ్యపుస్తకాలలో లేని అనేక విషయాలను శాస్త్రీయ దృక్పథం లో ఆలోచించడం ,అర్థం చేసుకోవడం నేర్పింది ఆ అసమాన అద్వితీయ లైబ్రరీ నే.
వీరితో పాటు ఇట్లాంటి ఒక స్కూల్ ఉందని, దానికి ఒక ప్రవేశ పరీక్ష రాయాలని మా బొందుగుల ప్రాథమిక పాఠశాల లో తను పరిచయం చేసి నన్ను తీసుకెళ్ళి నల్లగొండ పట్టణంలో నాతో పరీక్ష రాయించి నన్ను ఈ నిచ్చెన మెట్డు ఎక్కించిన నా ఉపాధ్యాయుడు ఇంద్రసేనా రెడ్డి సర్…The first BEd teacher posted in ZPHS Bondugula.
అందరకీ వందనాలు..
ఈ మహిమాన్విత పాఠశాల రూపకల్పన చేసిన నాటి ముఖ్యమంత్రి పి.వి. నర్ సింహా రావు గారిని, స్థలదాత (44ఎకరాలు) మద్ది నారాయణ రెడ్డి గారిని మరచిపోతే చరిత్ర క్షమించదు.
It is the brain child of Ex CM and PM PV Narasimha RAO garu.
--Dr.Linga Reddy Kasula